ఏపీ రైతులకు శుభవార్త.. రాయితీతో 47 వేల క్వింటళ్ల విత్తనాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది కూటమి సర్కార్. వర్షం ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో రైతులు చాలా వరకు పంట నష్టపోయారు. పలు జిల్లాలలో 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనం అయ్యిందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 54 కరవు మండలాలను అనౌన్స్ చేశామని చెప్పాడు 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా 159.2 కోట్లను మంజూరు చేసినట్టుగా వెల్లడించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఆ పూర్తి మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన రైతులకు రాయితీతో 47 వేల క్వింటళ్ల విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పాడు. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.