హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నడిచిన భూమికి వచ్చే అవకాశం నాకు దక్కింది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాంతీయని విస్మరించని జాతీయవాదం జనసేనది. ఇవాళ బాలా సాహెబ్ ఠాక్రే స్మృతిదినం. స్ధానిక వనరులు, మానవవనరులు కోల్పోకూడదనే నేను తెలంగాణ కు కూడా మద్దతిస్తాను. ప్రాంతీయత బలం ఉండాలి.. జాతీయతా భావాలని చంపకూడదు. బాలా సాహెబ్ ఠాక్రే లాగా సిద్ధాంతం కోసం నిలబడాలి.. పదవులు, అధికారం వస్తాయా రావా అని కాదు. RSS లేని భారతదేశం ఇంత బలంగా ఉండేదా అనిపిస్తుంది.
ఇక నెల్లూరు దగ్గర తుఫాను సమయంలో నా చిన్నపుడు, RSS కార్యకర్తలు చేసిన శుభ్రతకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపించింది. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి NDA కృషి చేస్తోంది. 2028 నాటికి మహారాష్ట్ర ని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్దగా మార్చనుంది NDA. ఏపీలో వైసీపీని కొట్టాం అంటే మామూలుగా కొట్టామా.. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి మనం. బాలా సాహెచ్ థాక్రే జాతీయ వాదం పెరగాలి, సనాతన ధర్మం రక్షింపబడాలి అని కోరుకున్నారు. అందుకే మహాయతీ సర్కార్ మహారాష్ట్రలో రావాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.