కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులను ఎదుర్కొంటున్నారు జైళ్ళ పాలు అవుతున్నారు అని స్టేషన్ ఘణపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేటీఆర్ దోచుకున్నాడు కాబట్టి, తప్పు చేసినావ్ కాబట్టి, నీ తప్పులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీసి విచారణ చేస్తున్నది కాబట్టి, నేను జైలుకు పోవడానికి సిద్ధమేనని కేటీఆర్ అంటున్నాడు. కేసీఆర్ హరీష్ రావు మీద త్వరలోనే కాలేశ్వరం మీద వేసిన కమిషన్ కు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కుటుంబం మొత్తం అవినీతికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
కల్వకుంట్ల కుటుంబం ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను హైదరాబాదులో ఆక్రమించుకున్నారు. ఏనాడో పాపము పండుతది, పాపం పండిన రోజు వీళ్ళందరూ కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇక నన్ను 100 కోట్లకు కాదు కదా 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. కాబట్టి నా పైన నీచపు ఆరోపణలు చేసేవారు నాపైన అవినీతి ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. నా 30 ఏండ్ల రాజకీయంలో ఎవరికైనా సహయంచేసానేతప్ప ఎవరి దగ్గర నుండి ఒక పైసా తీసుకోలేదు అని కడియం శ్రీహరి అన్నారు.