పవన్ స్పీచ్ లకు మరాఠా గడ్డ ఫిదా.. మహాయుతికి అధికారం ఖాయమంటూ విశ్లేషణలు..

-

పంచ్ డైలాగులు.. పవర్ ఫుల్ స్పీచ్… అక్కడక్కడ ప్రాంతీయ సెంటిమెంట్.. మహనీయులను గుర్తుకు తెచ్చుకోవడం వంటి వాటితో జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లారు.. పోలింగ్ దగ్గర పడుతున్న వేళ..మహాయుతి కూటమి ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచింది.. తెలుగు ఓటర్ల టార్గెట్ గా.. పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ కలిగిన నేతలతో ప్రచారాలు చేయిస్తోంది.. ఇప్పటికే తెలంగాణకి చెందిన బిజెపి నేతలు విస్తృతంగా జనాల్లో పర్యటిస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకుంటూ మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు..

మరాఠా గడ్డపై మరోసారి బాగా వేసేందుకు మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.. జనాదరణ కలిగిన నేతలచేత.. ఎన్నికల ప్రచారాలు చేయిస్తుంది.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, అమిత్ షా వంటి అగ్ర నేతలు బహిరంగ సభలు నిర్వహించారు.. మహారాష్ట్రలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.. కాంగ్రెస్ కూటమికి అధికారం ఇస్తే.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని విమర్శిస్తున్నారు.. కాంగ్రెస్ చెబుతున్న గ్యారెంటీలకు.. ఆ పార్టీ నేతలు గ్యారెంటీ ఇవ్వలేరంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.. కాంగ్రెస్ బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ ను పెంచిన వేళ.. పవన్ కళ్యాణ్ ఎంట్రీ భారీ హైప్ ను క్రియేట్ చేసింది..

ఏపీలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్.. బిజెపి ఆధ్వర్యంలో ఉన్న మహాయుతి కి మద్దతుగా ఎన్నికల ప్రచార పర్వంలోకి దూకారు.. తెలంగాణకి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో.. తెలుగు వారు ఎక్కువ.. అందులోనూ సినీ గ్లామర్ కల్గిన్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. ఈ విషయాన్ని గ్రహించిన కమలం పెద్దలు.. పవన్ కళ్యాణ్ తో ఫినిషింగ్ టచ్ ఇప్పించేందుకు ఎన్నికల ప్రచార బాధ్యతను అప్పగించారు.. స్టార్ క్యాంపెనర్ గా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. పవర్ఫుల్ డైలాగులతో బిజెపి పెద్దలు పెట్టుకున్నా నమ్మకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దేశం కోసం మోడీ సర్కారీ ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.. సనాతన ధర్మాన్ని బిజెపి మాత్రమే కాపాడగలుగుతుందని.. సెంటిమెంట్తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఆర్టికల్ 370 నుంచి అయోధ్య రామ మందిరం వంటి క్లిష్టమైన సమస్యలని మోడీనే సరిదిద్దారంటూ చెప్పుకొస్తున్నారు..

మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాలో పవన్ కళ్యాణ్ చేత బిజెపి పెద్దలు ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ప్రసంగాలలో చత్రపతి శివాజీ, బాలా సాహెబ్ ఠాక్రే వంటి మహనీయులను గుర్తు చేస్తూ.. మరాఠీల ఓటు బ్యాంకు ను కూడా మహాయుతి ఖాతాలో వేయించేందుకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు.. ఐదు సభలు, రెండు రోడ్డు షో లు చేస్తున్న పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు..

పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు రోడ్ షోలకు జనాదరణ భారీగా ఉండడంతో.. మహా యుక్తి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో వ్యక్తమవుతోంది. మరోపక్క తెలంగాణకు చెందిన బిజెపి నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. టార్గెట్ మహారాష్ట్ర అన్నట్లుగా మహాయుతి మరోసారి అధికారంలోకి రావడం కోసం.. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news