చందానగర్ లో హైడ్రా కమిషనర్.. 5 వేల గజాల స్థలం..?

-

చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో వివరించారు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్.. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాల్లు STP ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మల్లిస్తున్న తీరును పరిశీలించారు. దీప్తి శ్రీ నగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు హైడ్రా కమిషనర్.

ఈ క్రమంలో దీప్తి శ్రీ నగర్లో ప్రజ అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన వారిపై హైడ్రా కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేసారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక హైడ్రా అధికారులను ఆదేశించిన కమిషనర్ రంగనాథ్.. రెగులకుంట, బక్షికుంట మాదిరే నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ది పనులు చేపడతామని మీడియాకు వెల్లడించారు. అలాగే చెరువుల తో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని చెప్పారు రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news