రోజులు మారుతున్న కొద్దీ వంటల్లో మార్పులు ఎన్నో రకాలుగా వస్తున్నాయి. ప్రపంచ రికార్డులు సాధిస్తున్నాయి వంటకాలు. భారీ భారీగా కేకులు, ఇతరత్రా వంటలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక అరుదైన వంటకం గిన్నిస్ రికార్డుల్లోకి వెళ్ళింది. దాదాపు 1995 కేజీల కిచిడీని తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దృష్టిని ఆకర్షించారు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో ఇది జరిగింది. అక్కడి నిర్వాహకులు దీని కోసం తీవ్రంగానే కష్టపడ్డారు. ఇది ఎందుకు తయారు చేసారు అంటే, కిచిడీని సట్లెజ్ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కోసం. ఈ కిచడిని భక్తులకు ప్రసాదంగా వడ్డించారు.
1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్ రికార్డ్స్‌లోకి చోటు దక్కించుకున్నారు. దీనిని తయారు చేయడానికి తీవ్రంగానే కష్టపడ్డారు. మొత్తం 25 మంది చెఫ్‌లు కలిసి ఐదు గంటల్లో ఈ కిచిడీని రూపొందించారు. ఇందుకోసం మొత్తం 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలు, 1,100 లీటర్ల నీటిని కిచిడీ తయారీలో నిర్వాహకులు వినియోగించారు.