పదేళ్ల ఎదురుచూపులకు విలువ లేదా అంటున్న కాంగ్రెస్ నేతలెవ్వరు..? వారిలో అసంతృప్తికి కారణం అదేనా..?

-

శ్రావణమాసం పోయింది.. దసరా దమకా పక్కా అనుకున్నారు..అది పోయి దీపావళి కూడా వచ్చేసింది.. త్వరలో సంక్రాంతి కూడా వస్తున్నా.. ముఖ్యనేతలకు మాత్రం నామనెటెడ్ పదవులు దక్కడం లేదు..దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది.. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా..పదవులకోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు.. ఇంతకీ నిరాశలో ఉన్న ఆ జిల్లా నేతలెవ్వరంటే..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవులు దక్కలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు పదవుల కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరి ఏడాది కావొస్తుంది.. తనదైన శైలిలో ప్రజా రంజక పాలన సాగిస్తోంది..పదేళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులకు మాత్రం సరైన దారి చూపించలేకపోతోందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.. అధికారం కోసం పదేళ్ల పాటు నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు.. పార్టీ అదికారంలోకి రాగానే పదవులు వస్తాయని భావించినా.. అది జరక్క పోవడంతో కీలక నేతలు తీవ్ర బాధలో ఉన్నారట..

వరంగల్ జిల్లాలో పొలిటికల్ గా కీరోల్ పోషించిన వారు.. తమకు పదవి యోగం ఎప్పుడాఅ అని ప్రశ్నిస్తున్నారు. మొన్నటి సాదారణ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. 10 స్థానాలను గెలుచుకుంది హస్తం పార్టీ.. స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య 11కి చేరింది..
రాష్ట స్థాయి చైర్మన్ పోస్టులపై వరంగల్ నేతలు ఆశపడుతున్నారు.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అభిప్రాయం ఆ ప్రాంతనేతల్లో ఉంది.. రెండుసార్లు ప్రకటించిన నామినెటెడ్ పదవుల్లో కొందరికి మాత్రమే ప్రాదాన్యత ఇవ్వడంపై ఓవర్గం నేతలు గుర్రుగా ఉన్నారు.. రాష్ట స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున పోటీ పడుతున్నారు..సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేతల ఆర్తనాదాలు సీఎంకు వినిపిస్తాయో లేదోమరి..

Read more RELATED
Recommended to you

Latest news