బ్రేకింగ్; రష్మిక ఇంట్లో ఐటి సోదాలు…!

-

టాలివుడ్ నటులను, దర్శక నిర్మాతలను కొంత కాలంగా ఐటి దాడులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. వారి కంటి మీద కునుకు ఉంచడం లేదు ఐటి అధికారులు. ఇతర భాషలు ఏమో గాని తెలుగులో మాత్రం ఐటి దాడులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రముఖ సిని నటులు అందరి ఇళ్ళల్లోను ఐటి దాడులు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా పలువురి ఇళ్ళ మీద ఐటి దాడులు జరిగాయి. అలాగే హీరో నాని, యాంకర్ సుమా సహా కొందరి ఇళ్ళ మీద ఐటి దాడులు జరిగాయి అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న అందరి మీద ఈ ఐటి దాడుల ప్రభావం ఎక్కువగానే పడుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటి మీద కూడా చేసారు.

తాజాగా టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలుగుతోన్న కుర్ర హీరోయిన్ రష్మిక మందన్నకు ఐటీ అధికారుల సెగ తగిలింది. ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆమె ఇంట్లో సంక్రాంతి వేళ ఆదాయ పన్ను అధికారులు దాడులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. ఆమె కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారట.

Read more RELATED
Recommended to you

Latest news