అభివృద్ధి జరగాలంటే.. ఎవరో ఒకరూ భూమిని కోల్పోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భూమికి చాలా విలువ ఉంది. వెనుకట భూమిని చూసే పిల్లను ఇచ్చారని ఓ ఉదాహరణ కూడా చెప్పారు. నష్టపరిహారం అత్యధికంగా ఇచ్చి భూమిని సేకరించి పరిశ్రమలను తీసుకొద్దామంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. అధికారులపై దాడులు చేసి.. హత్యయత్నం చేస్తున్నారు. వారిపై కేసులు పెడితే.. మాపై కేసులు పెడతారా..? అంటూ రివర్స్ ప్రశ్నిస్తున్నారు.
పరిశ్రమలు పెట్టి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా ఆలోచన అని తెలిపారు. కేసీఆర్ మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 4 గ్రామాల్లో 1100 ఎకరాలు సేకరిస్తున్నానని తెలిపారు. కుట్ర చేసినందుకు ఊసలు లెక్కపెట్టుకుంటది.. కేటీఆర్ ఎంత దూరం ఉరుకుతడో ఉరకనీయి అని చూస్తున్నానని తెలిపారు. భూమి గురించి నాకు తెలిసే.. భూమి చాలా విలువైంది.. కేసీఆర్ అసెంబ్లీకి రా స్వామి.. 80వేల పుస్తకాల గురించి మాట్లాడుదాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.