శీతాకాల సమావేశాలు 25 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎత్తును తగ్గించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తాం అని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిర్వాసితులకు ఆర్. అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తాం . దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తాం. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం. ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తాం. ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడము. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తాం. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తాం. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తాం అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.