ఇంటర్నెట్లో ఈమధ్య డెమీసెక్సువాలిటీ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు డెమీసెక్సువాలిటీ అంటే ఏమిటి..? దానికి సంబంధించిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డెమీసెక్సువాలిటీ అనేదాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. అపోజిట్ జెండర్ పట్ల ఫాస్ట్ గా సెక్స్ కోరికలు కలగకుండా వాళ్లతో ఒక రకమైన బంధం ఏర్పడి.. ఆ బంధంలో అవతలి వాళ్ళ మీద విపరీతమైన అట్రాక్షన్ ఏర్పడి, ఆ తర్వాత సెక్స్ కోరికలు కలగటమే డెమీసెక్సువాలిటీ.
దీన్ని సింపుల్ గా చెప్పాలంటే.. డెమీసెక్సువాలిటీ లక్షణాలు కలిగిన మనుషులు అపోజిట్ జెండర్ పట్ల అంత ఈజీగా అట్రాక్ట్ అవ్వరు. వాళ్ల మీద అట్రాక్షన్ రావాలంటే స్ట్రాంగ్ గా ఎమోషనల్ బంధం ఏర్పడాలి. అప్పటివరకు వాళ్ల ఫిజిక్ చూసి గానీ, అందం చూసికానీ వీళ్ళలో ఎలాంటి ఫీలింగు రాదు.
అందాన్ని చూసి కాదు, మనసు చూసి ప్రేమించాలని సినిమాలో డైలాగులు వినిపిస్తుంటాయి. ఎగ్జాక్ట్ గా అలాగే డెమీసెక్సువాలిటీ కలిగిన మనుషులు ప్రవర్తిస్తుంటారు. వీళ్లకు అపోజిట్ జెండర్ మీద ఎలాంటి ఎమోషన్ లేకుండా కోరికలు కలగవు.
ఒక పర్సన్ ని బాగా అర్థం చేసుకుని వాళ్లతో ఎమోషనల్ గా ఎంతో జర్నీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ల మీద సెక్స్ కోరికలు కలుగుతాయి.
అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అవతలి వాళ్ళతో ఎమోషనల్ గా బాండ్ పెంచుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. కొంతమంది కొన్ని వారాలు తీసుకుంటే ఇంకొంతమందికి సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది.
డెమీసెక్సువాలిటీ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే..?
సాధారణంగా అందరూ సెక్స్ గురించి ఒకేలా ఆలోచిస్తారు. బట్ సెక్స్ మీద ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. అలాంటి వాళ్లలో డెమీసెక్సువాలిటీ ఒకరు.