నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం పాల్గొన మంత్రి ఆనం కీలక కామెంట్స్ చేసారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధి లో భాగ స్వాములు కావాలి అని పిలుపిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలి. అన్ని ప్రాంతాలను సమ దృష్టి తో అభివృద్ధి చేస్తాం. శాశ్వత ప్రాతిదికన పనులు చేపట్టి అభివృద్ధిలో మీదైన ముద్ర వేయండి అన్నారు.
ఇక మీ ప్రాంత ప్రజలు మిమ్మలను గుర్తు పెట్టుకునే విదంగా పని చేయాలి. మంచి ప్రజా ప్రతినిధులుగా గుర్తింపు తెచ్చుకోండి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అధికారులు విలువ ఇవ్వాలి. వేగవంతమైన అభివృద్ధికి సహాకరించండి. మండల పరిషత్ సర్వ సభ్య సమావేశాలకు సంబంధిత అధికారులు తప్పని సరిగా హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాకపోతే చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఇక పట్టణాలు, నగరాలలో కాలుష్యం లేకుండా చూడాలి. గ్రీన్ ఎనర్జీ ఏర్పాటుకు కేంద్ర…రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ల పై ప్రజలలో అవగాహన కల్పించాలి. గ్రామ,మండల స్థాయిలలో వర్క్ షాప్లులు పెట్టాలి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలి. సోలార్ విద్యుత్ ను ప్రోత్స హించాలి అని ఆనం పేర్కొన్నారు.