అదాని నీ జగన్ మూడు సార్లు ఎందుకు కలిశారు : ఆనం వెంకట రమణా రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీగా అవినీతి చేశారని పేర్కొన్నారు. ఒప్పందాలపై ఆయన ఒక్క విషయం కూడా మీడియాకు చెప్పలేదని తెలిపారు.

మళ్లీ ఇప్పుడు కట్టు కథలు అల్లుడున్నారని ఆరోపించారు. ఆ ఒప్పందాలలో జగన్ రూ.1750 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. జగన్ దాదాపు 3 సార్లకు పైగా అదానీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 సీబీఐ కేసులు ఉన్న జగన్ ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లలేదని.. వీటిపై న్యాయ స్థానాలు కూడా త్వరగా విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు అదానీ పై అమెరికాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ పై రకరకాల వార్తలు వినిపించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news