కూటమి పార్టీల్లో రాజ్యసభ హీట్ నడుస్తోంది.. తమకు అవకాశం కల్పించాంటూ మూడు పార్టీలకు చెందిన సీనియర్లు, అర్దిక బలం కల్గిన నేతలు అధినేతలను కలుస్తున్నారు.. సీఎం చంద్రబాబును ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కలిసి.. తమ మనస్సులోని మాట బయట పెడుతున్నారు.. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా తమకు ఒక రాజ్యసభ ఇవ్వాలని కోరుతున్నారట.. దీంతో ఆ మూడు స్థానాలకు ఎవరికి వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతోంది..
టీడీపీతోపాటు.. జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు.. దీంతో ఖాళీగా ఉన్న మూడు స్థానాలు తమకు కావాలని టీడీపీ భావిస్తుంటే.. వపన్ కూడా ఒక్క సీటు తమకు ఇవ్వాలంటూ పావులు కదుపుతున్నారు.. బిజేపీ సీనియర్లు కూడా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారట.. దీంతో ఈ మూడు స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తులు స్టాట్ చేశారు.. టీడీపీ నుంచి టిక్కెట్లు త్యాగం చేసిన దేవినేని ఉమా గంపెడాశలు పెట్టుకున్నారట.. అలాగే విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు, గల్లా జయదేవ్ తోపాటు.. కంభంపాటి కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీదా మస్తాన్ రావు కూడా మరోసారి రాజ్యసభను ఆశిస్తుండటంతో.. ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.. టీడీపీ నుంచి గల్లా జయదేవ్, బీదా మస్తాన్ రావు, అశోక్ గజపతి రాజులకు ఛాన్స్ ఉంటుందనేది టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.. అయితే పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడితే.. వారి ముగ్గురులో ఒకరు సీటు త్యాగం చెయ్యాల్సి ఉంటుంది..మరోపక్క నాగబాబు కూడా రేసులో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది.. మొత్తంగా లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో త్వురలోనే తెలుస్తుంది..