ఎమ్మెల్యేలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు : అంబటి

-

కూటమి నుండి 164 మంది గెలిచారు. మంచి అవకాశం మించిన దొరకదు అన్న చందంగా కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ధనార్జన కోసం శాసన సభ్యులు పోటీ పడుతున్నారు అని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబే వారి మధ్య పంచాయతీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటున్నారు. చంద్రబాబు మైకు ముందు అద్భుతమైన సొల్లు కబుర్లు చెబుతున్నారు.

కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుకల్లో దోపిడికి పోటీ పడుతున్నారు. మా పాలన లో కంటే ఎక్కువ ధరకు ఇసుక లభ్యమవుతోంది. కడపలో బూడిద కోసం ఫైట్ జరుగుతోంది. ఇద్దరు తెలుగు తమ్ముళ్లు కొట్టుకునే పరిస్థితి కొచ్చారు. చంద్రబాబు ఇద్దరి నేతల మద్య పంచాయితీ పెడితే..జేసి ప్రభాకర్ రెడ్డి పంచాయతీకి కూడా రాను పో అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరూ వ్యాపారం చేయాలన్న ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ ఎమ్మెల్యేల అవినీతి దందా చంద్రబాబు, లోకేష్ కు తెలియదా. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించుకుంటాం అని ఎమ్మెల్యేలు అంటున్నారు అని అంబటి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news