తూర్పుగోదావరి ప్రజలకు అలర్ట్. నేడు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 116 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 16,737 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు. పోటీలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉండగా…, ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.
ఇక బొర్రా గోపిమూర్తి(భీమవరం), గంధం నారాయణరావు(ద్రాక్షారామ), నామన వెంకటలక్ష్మి (సామర్లకోట), కవల నాగేశ్వరరావు(రాజమహేంద్ర వరం), పులుగు దీపక్ (తాడేపల్లి గూడెం) అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. విజయం సాధించినవారు రెండేళ్ల రెండు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక అనివార్యం అయింది. అందుకే నేడు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.