ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కీలక కామెంట్స్ చేసారు. కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించడం హాస్యాస్పదం. రేవంత్ రెడ్డికి సామాజిక బహిష్కరణ పదానికి అర్థం తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యాతారాహిత్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.
సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తుందా. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఏకం చేస్తానంటే.. రేవంత్ రెడ్డి సామాజిక బహిష్కరణ అంటున్నారు. ప్రధాని, కిషన్ రెడ్డి, గుజరాత్ పై చేస్తున్న రేవంత్ రెడ్డి విమర్శలు సరైనవి కావు. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలపై బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను మార్చుకోవాలి. తెలంగాణ భాష పరువు తీసేలా రేవంత్ రెడ్డి మాట్లుడుతున్నారు అని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.