తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ తలశిల రఘురామ్. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. నాపైన కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. గొల్లపూడిలో ఆత్మహతగయ చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత. అతను ఇరవై ఐదు, ముప్పై కోట్ల వరకు టీడీపీ వారికి ఇవ్వాలి. వాళ్లు వాళ్లు గొడవలు పడి కేసులు పెట్టుకుని రిమాండ్ కు వెళ్లారు. ఇందులో వైసీపీ వారికి ఎలాంటి సంబంధం లేదు. దీనిమీద పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు.
గ్రామంలో నా డబ్బులే ఖర్చు పెట్టాను తప్ప.. నేను ఎవరి దగ్గరా తీసుకోలేదు. చనిపోయేముందు అతను వీడియో తీసాడు. టీడీపీ వారే తన చావుకు కారణం అని అతను వీడియోలో కూడా చెప్పాడు. ఎవరి ఆస్తి ఎవరు రాయించుకున్నారో కూడా విచారణ జరపాలి. డబ్బులు రావాల్సిన వారే రాయించుకుని ఉంటారు. ఇందులో నాకు ఏం ప్రమేయం ఉంటుంది.. కానీ నా మీద ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని తలశిల రఘురామ్ పేర్కొన్నారు.