గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

-

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలంటూ దాఖలు అయిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు కుదరదంటూ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.

2022 గ్రూప్ -1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయపడింది. దీని వల్ల నియామక ప్రక్రియలో ఆలస్యం అవుతుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news