నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను – మంత్రి నారాయణ

-

నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను అంటూ బాంబ్ పేల్చారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోంది.. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపాఉ.


రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి నా వంతు సలహాలను ఇస్తున్నాను… తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాలు తరచూ జరగాలని కోరారు. వీటివల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని… విద్యారంగంలో నాకు 44 సంవత్సరాల అనుభవం ఉందని వివరించారు. నేను వీధి బడిలోనే చదువుకున్నా… నేను పదో తరగతి ఫెయిల్ అయ్యానని తెలిపారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న భవనం వెంకట్రామ్ రెండు గ్రేస్ మార్కులు ఇచ్చారు… దీంతో నేను పాస్ అయ్యానని వివరించారు. తరువాత కసిగా చదివాను… అప్పటినుంచి డిగ్రీ..పి. జీ.లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానని వెల్లడించారు. విద్యా సంస్థను ప్రారంభించి అగ్రస్థానానికి తీసుకువచ్చానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news