రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేసీఆర్ వరి వేస్తే.. ఉరే అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేసిన వారికి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. తెలంగాణలోనే వరి పంటలో నల్గొండ జిల్లా నెంబర్ వన్ అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
వ్యవసాయం అంటే పండుగ అనేలా తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉంటే.. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేది అన్నారు. శాసన సభలో ప్రతిపక్షం స్థానం కలిగి ఉండటం తెలంగాణకే మంచిది కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే.. కేసీఆర్ పాలనలోనే నల్గొండకు ఎక్కువ అన్యాయం జరిగిందని తెలిపారు.