మూడు రోజుల్లో పుష్ప-2 ఎంత వసూలు చేసిందంటే..?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప2 మూవీ డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు 449 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.621 కోట్లు వసూలు చేసి రికార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ సినీ కెరీర్ లోని ఇంత భారీగా వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. మూడు రోజుల్లో 205 కోట్లు హిందీలో వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. 

తొలిరోజు RRR పేరిట ఉన్న రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. అధికారికంగా మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రకటించారు. పుష్ప 2 మూవీ అల్లు అర్జున్ నటన అద్భుతమని.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. రష్మిక, అల్లు అర్జున్ అద్భుతమైన నటన కనబరచడంతో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. ఈ మూవీకి బలమైన విలన్ ఉండి ఉంటే.. మరో విధంగా ఉండేదని.. ఇంకా కలెక్షన్లు పెరిగేవని పలువురు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news