సిద్ధిపేటలో జరిగిన BRSLP సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది ఈ BRSLP మీటింగ్. ఇక ఈ మీటింగ్ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. రేపు అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా రారా అన్నది మీరే చూస్తారు అని పేర్కొన ఆయన.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్ లో చర్చ జరిగింది అని తెలిపారు.
అయితే గత ఏడాదిగా జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని అసెంబ్లీలో ఎండగడుతాం. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పై చట్టబద్దత కోసం అసెంబ్లీలో పోరాడుతాం అని పేర్కొన్నారు. అలాగే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పై అసెంబ్లీలో పోరాడుతాం. ఇక రెండు విడతల రైతు బంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టు బడుతాం. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల పై గళం విప్పుతాము అని స్పష్టం చేసారు మాజీ మంత్రి హరీష్ రావు.