ఎన్టీఆర్ వజ్రోత్సవాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి టిడి జనార్ధన్ కీలక కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు అని తెలిపారు. అలాగే ఈనెల 14వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ ప్రముఖులు అతిరథ మహారధులు హాజరవుతారు.
ఈతరం నటీనటులకు ఆయన ఆదర్శం. ఆయన ఈ తరం నటులకు డిక్షనరీ లాంటివారు. ఇటువంటి పాత్రలోనైనా జీవించగల వ్యక్తి అన్న ఎన్టీఆర్ మాత్రమే. పౌరాణికం జానపదం ఎందులోనైనా ఆయనకు ఆయనే సాటి అని జనార్ధన్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాలలోకి వచ్చి ప్రయోజనం సృష్టించారు. వృద్ధులకు పెన్షన్ పంపిణీ ఆడపిల్లలకు ఆస్తిలో వాటా వంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కు మాత్రమే దక్కుతుంది. నదుల అనుసంధానం ఎన్టీఆర్ తీసుకువచ్చారు. కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకతాటికపై తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్ కి దక్కుతుంది అని టిడి జనార్ధన్ పేర్కొన్నారు.