తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16కి వాయిదా

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కి వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా డిసెంబర్ 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 6.05 గంటలకు ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అయితే విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది.

అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి తెలిపారు. నేను శాసన సభ్యుడినా కాదా? నేను అసెంబ్లీలో మాట్లడకూడదా? మంత్రులంటే మాకు అభిమానం.. అలానే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా..? అని ప్రశ్నించారు. శాసన సభ్యుడినే కాదంటే మాట్లాడటం ఎందుకు..? అని ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావాలి అంటూ నోరు జారారు కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్.

Read more RELATED
Recommended to you

Latest news