రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన వైసీపీ నేతలు., నేడు నంగనాసి మాటాలు మాట్లాడుతున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇసుక, లిక్కర్ పేరుతో కోట్లు దండుకున్నారు. పాఠశాలలకు రంగులు వేసి.. ఆ పాఠశాలలనే ఎత్తి వేశారు. నాకు వ్యవసాయ పరంగా అన్ని చేయాలని తపన ఉంది.. కానీ పైసా లేదు. కానీ రూ.145 కోట్లతో రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.860 కోట్లతో రహదారులు బాగు చేస్తున్నాం. సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నాం.
నేడు పలు పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. వీటి ద్వారా ప్రత్యేక్ష, పరోక్షంగా 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీలా వ్యవహరించి ఉంటే.. మీరంతా జైల్లో ఉండేవారు. ట్రూ ఆఫ్ చార్జీల పాపం వైసీపీ దే. భవిష్యత్ లో విద్యుత్తు చార్జీలు పెరగకుండా సీఎం ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాస్తా ఆలస్యమైనా సూపర్-6 పథకాలు అన్ని తప్పక అమలు చేస్తాం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.