డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు పోలీసులు. అలాగే పవన్ కళ్యాణ్ పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి డీజీపీతో మాట్లాడారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఇక నిందితుడి నుంచి రెండు ఫోన్స్ కాల్స్ వచ్చాయని అనితకు వివరించారు డీజీపీ.
అయితే బెజవాడ బందరు రోడ్డు నుంచి ఫోన్ పేషీకి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. బందరు రోడ్డులో ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర నుంచి కాల్ వచ్చినట్టు పోలిసులు ట్రెస్ చేసారు. అలాగే ఆ ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి నూక మల్లికార్జున రావు గా గుర్తించిన పోలీసులు.. వెంటనే మల్లికార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు లబ్బిపేట పోలీసులు. ఇలా గంటల వ్యవధిలోనే నిందితుడిని విజయవాడలో అరెస్ట్ చేసారు.