ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఆశ వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏ లు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఉన్నారు.
అయితే…కేటీఆర్ తో పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు. అటు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే.. ఎక్కడిక్కడే జిల్లాల వారీగా ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు. కొంత మందిని అరెస్ట్ చేశారు.