ఆస్తుల తగదానికి చిన్న బ్రేక్ ఇస్తున్నట్లు..మంచు మనోజ్ ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మంచు కుటుంబ గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అయితే.. మంచు వారి డ్రామ కథ చిత్రం నేటితో ముగిసిందని అంటున్నారు. ఈ మేరకు ఆస్తుల తగదానికి చిన్న బ్రేక్ ఇస్తున్నట్లు..మంచు మనోజ్ ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆస్తుల తగదానికి బ్రేక్ ఇస్తున్నా,షూటింగ్ కోసం వెళ్తున్నానని అంటే మనోజ్ తెలిపారట. భైరవం సినిమా లో నటిస్తున్నా, వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ, బౌన్సర్లను నిన్న సాయంత్రమే ఇంటి నుంచి పంపేసా,ప్రైవేట్ వ్యక్తులు ఎవరు నాతో లేరని క్లారిటీ ఇచ్చారట. దీంతో మంచు వారి డ్రామ కథ చిత్రం నేటితో ముగిసిందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు, ఆయన సతీమణి ఇద్దరూ కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.