హైదరాబాద్ లో దారుణం.. తండ్రి కొడుకులు కలిసి మహిళాపై అత్యాచారం..!

-

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ నివాసం ప్రాంతంలో ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి మహిళా పై అత్యాచారం ఆపై హత్య యత్నం చేసారు తండ్రి కొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి అత్యాయత్నం చేసారు తండ్రి కొడుకులు. అయితే ప్రస్తుతం తండ్రి కూడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బిబి అనే మహిళ ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈ నెల 9వ తేదీ అదే ప్రాంతానికి చెందిన శ్రీను, రాజు అనే ఇద్దరు తండ్రి కొడుకులు ఆమెకు ఫంక్షన్ హల్ లల్లో పని ఉందని మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమెను చెంగుమల్ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడ్డ ఫాతిమా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. గమనించిన స్థానికులు ఆమెను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెంగుమల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు శీను, రాజు తండ్రి కొడుకులను బండ్లగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news