చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ 

-

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ను తన నివాసంలో అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మేజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తరువాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

 

ఆ తరువాత హైకోర్టు క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. దీంతో  అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సొంత పూచీకత్తు రూ.50వేలు  సమర్పించాలని అల్లు అర్జున్‌ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది హైకోర్టు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ రాత్రి చంచల్ గూడ జైలులోనే నిద్రించాడు. ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ పై ఇచ్చిన ఫార్మాట్ సరిగ్గా లేదని.. హైకోర్టు కాపీ ఇంకా అప్లోడ్ కాలేదని నిన్న రాత్రి   జైలు అధికారులు వెల్లడించారు. బెయిల్ కాపీ అధికారికంగా రావడం ఆలస్యం కావడంతో నిన్న రాత్రి రిలీజ్ చేయలేదు.  తాజాగా చంచల్ గూడ జైలు నుంచి విడుదల చేశారు. అల్లు అర్జున్ వెహికిల్ నేరుగా చంచల్ గూడ జైలు వద్దకు వెళ్లింది. ఆ వెహికిల్ లోనే చంచల్ గూడ జైలు నుంచి తన నివాసానికి వెళ్లారు అల్లు అర్జున్.  

Read more RELATED
Recommended to you

Latest news