త్వరలోనే మరో మెగా డీఎస్సీ.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

-

తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఒక రోజు హాస్టల్ తనిఖీలో భాగంగా ఖమ్మం, మధిర, బోనకల్ లోని సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్ లో నేటి నుంచి కొత్త మెనూను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్ననప్పుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని.. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలను పెంచినట్టు గుర్తు చేశారు. త్వరలోనే 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గురుకులాాలు, హాస్టళ్లకు బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం  ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 చార్జీలుంటే.. సవరించి రూ.2100 చెల్లిస్తున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news