తెలుగు భాష సంగీతమైనటువంటి భాష. ఈ మధ్యకాలంలో తెలుగు భాష పై దాడి జరిగింది అని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాష పై పట్టు వెడుతుంది. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు కానీ భాష గురించి ఆలోచించరు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారు. విదేశీ ఉద్యోగాల కోసం తెలుగు భాషను మరిచిపోవడం జరుగుతుంది.
ఇది తెలుగు భాషా సమాజం మీద ప్రభావం చూపుతుంది. మాతృభాషను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏ భాష పైన పట్టు వస్తుంది. విదేశాలలో వారి మాతృభాషకే వారు ప్రాధాన్యత ఇస్తారు. ఏ భాష నేర్చుకున్న మాతృభాషను మరువరాదు. భాషా అనేది అక్కడి సంస్కృతి నీ తెలియజేస్తుంది. ప్రభుత్వాలు విద్యావిధానాలలో పలుమార్పులు తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అని అనుకోవడం పొరపాటు. ఉద్యోగ అవకాశాలకు భాషకు సంబంధం లేదు. ఇటీవల కాలంలో ఓ ప్రభుత్వం తెలుగు భాషను తీసివేసి ఆంగ్ల భాష ను విద్యాభాషగా చేయాలని ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో పాత విద్యావిధానాన్ని కొనసాగించాలని ఇప్పటి ముఖ్యమంత్రిని విద్యాశాఖ మంత్రి నీ కోరా. రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేయాలి. మన దేశంలో ఉన్న తెలుగు ప్రజల కన్నా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నారు. రెండు రాష్ట్రాలలో తెలుగు భాషను రెండో భాషగా కోర వలసి వస్తుంది. పక్క రాష్ట్రాలలో వారు తమ భాష కోసం ఎంత కృషి చేస్తున్నారో వారిని చూసి నేర్చుకోవాలి. మన తెలుగు భాషను మనమే పరిరక్షించుకోవాలి. ఒక తెలుగు మాస్టారు ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తాడు. ఇతర రాష్ట్రాలలో దేశాలలో వారు తమ భాషలో తప్ప ఇతర భాషలో సమాధానం చెప్పరు. కడపకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వీధి బడిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. గొప్పవాడు కావాలంటే ఇంగ్లీషు ఒక్కటి ప్రామాణికం కాదు. దేశంలో గొప్పవారు తెలుగు బడిలో చదువుకునే పైకి వచ్చినవారే అని ఎన్వి రమణ అన్నారు.