ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది.. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.. క్యాడర్లో జోష్ నింపి.. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.. ఈ క్రమంలో ఇటీవల అయన చేస్తున్న పర్యటనలు .. కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.. ఇంతకీ పవన్ కళ్యాణ్ స్టాటజి ఏంటో చూద్దాం..
గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపితో జతకట్టిన జనసేన.. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ఘన విజయం సాధించింది.. 100% స్ట్రైక్ రేట్ తో తమకు తిరుగు లేదని నిరూపించింది.. ఈ క్రమంలో మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంది.. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని చెబుతున్న పవన్ కళ్యాణ్… అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారట.. ప్రత్యర్థి పార్టీలో ఉండే బలమైన నేతలపై కన్నేసి.. కాపు నేతలని దగ్గరకు తీసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. ఇందుకోసం పార్టీ పటిష్టత కోసం కొత్త వ్యూహాలను పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. మరో 25 ఏళ్ల పాటు రాజకీయ సుస్థిరతను కోరుకుంటున్నారు.. ఇదే సమయంలో జనసేనను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఆయన స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది..
రాజకీయాల్లో ప్రత్యర్ధులను బలహీనపరచడం ఒక ఎత్తు అయితే.. సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మరొక ఎత్తు.. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పార్టీని సొంతంగా బలోపేతం చేసుకునే దానిపై దృష్టి పెట్టారు.. అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఇదే అదునుగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనే భావనలో ఆయన ఉన్నారట.. పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదనే అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమౌతోంది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ లాగా జనసేనకు గ్రామీణ ప్రాంతాలలో అనుకున్నంత స్థాయిలో క్యాడర్ లేదు.. దీంతో క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ను సంపాదించుకునేలా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. పవన్ కళ్యాణ్ కు అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు.. అధికారం లేకపోయినా ఇన్నాళ్లు పార్టీ బలంగా ఉందంటే కారణం కూడా వారే.. అలాంటి అభిమానులను నడిపించే నేతలు నియోజకవర్గ స్థాయిలో లేకపోవడంతో.. బలమైన శక్తిగా జనసేన ఎదగలేక పోతుందనే భావన ఆ పార్టీలో వ్యక్తమౌతోంది.. ఈ క్రమంలో బలమైన నేతలపై పవన్ కళ్యాణ్ గురిపెట్టినట్లు తెలుస్తోంది..
సాగునీటి సంఘం ఎన్నికలలో కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పోటీ చేసిన జనసేన నేతలు.. మరికొన్నిచోట్ల సొంతంగానే బరిలోకి దిగారు. ఇది జిల్లా నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల జనసేన నేతలు ఎన్నికల్లో పోటీ చేశారనే ప్రచారం నడుస్తుంది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బలం ఉన్నచోట సొంతంగా పోటీ చేయాలని భావిస్తున్నారట.. ఎన్నికలలోపు అన్ని నియోజకవర్గాలలో బలమైన శక్తిగా ఎదగాలని.. ఆ దిశగా కేడర్ ను సమాయత్తం చేసే ఆలోచనలో జనసేనాని ఉన్నారట.. 175 నియోజకవర్గాలలోను జనసేనను బలోపేతం చేయాలని.. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.. మొత్తంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్లు అర్థమౌతుంది..