ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు పోలవరం సందర్శించి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు కు కౌంటర్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. డయా ఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ఆలస్యం అయింది. స్పిల్ వే ను పూర్తి చేసింది మేము. గేట్లు వేసింది మేము. కాఫర్ డ్యామ్, డయా ఫ్రం వాల్ కట్టింది మేము అన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయా ఫ్రం నిర్మిస్తారా..? అని ప్రశ్నించారు.
పోలవరం పై చంద్రబాబు చెప్పేవన్నీ కూడా అబద్దాలేనని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 2300 కోట్లు వైసీపీ హయాంలోనే ముందస్తుగా విడుదల చేశాం. 2018లో పూర్తి చేస్తామన్నారు కదా.. అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.