కులగణనకు బీజేపీ సహకరించడం లేదని.. తెలంగాణ రాష్ట్రంలో కులగణన అంతిమ దశలో ఉందని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. దేశవ్యాప్త కులగణన సాధన కోసం మంగళవారం జంతర్ మంతర్ వద్ద మహాధర్నా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాధర్నాకు సంఘీభావం ప్రకటించి మల్లు రవి మాట్లాడారు. వీపీ సింగ్ ను బీజేపీ బలవంతంగా గద్దె దించిందన్నారు.
కులగణనను దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. నరేందర్ గౌడ్ శ్రమ వృధా కాదని మల్లు రవి పేర్కొన్నారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ అంబానీకి 28 న్యూస్ ఛానల్స్, 21 న్యూస్ పేపర్స్ ఉన్నాయని తెలిపారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటాను తీసుకొచ్చి బీసీలను మోసం చేసిందన్నారు. పూలే అంబేద్కర్ బాటలో మేకపోతుల నరేందర్ గౌడ్ నడుస్తున్నారని తెలిపారు.