ఎలక్ట్రిక్ బైకులకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ ఉద్దేశంతోనే బైక్ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ బైకులను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈమధ్య టీవీఎస్ నుండి విడుదలైన ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ బాగా పెరిగాయి.
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకున్న వారి మొదటి ఛాయిస్ టీవీఎస్ ఐ క్యూబ్ ST అవుతోంది.
వినియోగదారులను అంతగా ఆకర్షిస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ ST ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
బ్యాటరీ:
5.1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ వరకు మైలేజ్ ఇస్తుంది. పవర్ మోడ్ ఉపయోగిస్తే 110 కిలోమీటర్ల రేంజ్ వరకు మైలేజ్ వస్తుంది. నాలుగు గంటల 18 నిమిషాలలో జీరో నుండి 80% వరకు చార్జ్ అవుతుంది.
యాక్సిలరేషన్:
కేవలం 4.5 సెకండ్లలోనే జీరో నుండి 45kmph స్పీడ్ ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 82 kmph గా ఉంది.
టైర్స్:
ముందూ, వెనక ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉన్న ఈ బైక్, ముందువైపు డిస్క్ బ్రేక్, వెనకాల డ్రం బ్రేక్ సిస్టంతో ఉంది.
కనెక్టివిటీ:
మొబైల్ ద్వారా బ్లూటూత్ ని కనెక్ట్ చేసుకునే సౌకర్యం కలదు. ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే అలర్ట్ ని ఇస్తుంది, ఇంకా బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు అలర్ట్ ని, మొబైల్ కి కాల్ వస్తున్నప్పుడు అలర్ట్ ని ఇస్తుంది.
ప్రస్తుతం నాలుగు రకాల రంగుల్లో వస్తున్న ఈ బైక్ ధర.. 1,85,729 (ఎక్స్ షోరూం) గా ఉంది.