అసెంబ్లీలో అదానీ,రేవంత్ రెడ్డి సంబందంపై చర్చ పెట్టాలి : హరీశ్ రావు

-

రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారు. రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము రేవంత్ రెడ్డి, ఆదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12 వేల కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి.

Harish Rao
Harish Rao

అదానీపై రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు అని ప్రశ్నించారు. అదానీకి వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు 12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ రెడ్డి అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారు. రోడ్డుపై రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అదానీకి
ఏజెంట్ లా పని చేస్తున్నారు. అదానీకి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ పరవును, రాహుల్
గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ, రేవంత్ రెడ్డి సంబందం పై చర్చ
పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news