ఏపీకి బిగ్ అలర్ట్..ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని వివరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. దీంతో రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వివరించారు.
దీని ఎఫెక్ట్ కారణంగా.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో వర్షాలు ఉన్నట్లు తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నట్లు వివరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఎల్లుండి పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, వర్షాలు ఉన్నట్లు తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.