మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశించింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని నిన్న తప్పుబట్టారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించారు. గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేయడం జరిగింది.
అయితే… కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కూడా ఇదే తరహాలో టీటీడీ పై కామెంట్స్ చేశారు. కానీ వారిపై చర్యలు తీసుకోలేదు.. కానీ… మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశించింది టీటీడీ పాలక మండలి. తిరుమల కొండపై శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండిస్తూ.. శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశిస్తున్నట్లు సమాచారం.