ఫాల్స్ ఇన్పర్మేషన్ తో ఒకరు మాట్లాడటం బాధకరం అని టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. “దయచేసి అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ అండ్ అన్సర్స్ కి లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని లాయర్స్ చెప్పారు. ఆలిండియాలో కలెక్షన్స్ బ్రేక్ చేసిన ఒక సినిమాకి మొదటి షోలో కూర్చొని.. జనం తనను రిసీవ్ చేసుకున్నారో చూసుకునే లేకుండా పోయింది.
ఇంత పెద్ద సినిమా తీసిన అతను.. ఈ గార్డెన్ లో అతను మూలకు కూర్చొని ఉంటున్నాడు. దేశమంతా నీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటే.. నీవు ఇలా ఉన్నావు అని తండ్రిగా నేను అడిగాను. ఒక ఫ్యామిలీ ఇలా అయిపోవడం వల్ల బాధ పడుతున్నాడు. 22 సంవత్సరాలు కష్టపడి పేరు సంపాదించుకున్నాడు. మూడు జనరేషన్స్ వస్తోంది. మేము ఎటువంటి మనుషులం అనేది మీకు తెలుసు. మీ కళ్ల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు” అంటూ దాట వేశారు.