రివైండ్ 2024: థియేటర్లో హిట్టయినా ఓటీటీలో తేలిపోయిన సినిమాలు

-

థియేటర్లలో సినిమా హిట్ అయినంత మాత్రాన ఓటీటీలో ప్రేక్షకులు ఆదరించాలన్న రూల్ లేదు. కొన్ని కొన్ని సార్లు థియేటర్లో హిట్ అయిన సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులకు చాలా మామూలుగా కనిపిస్తుంటాయి.

ఇదే క్రమంలో థియేటర్లో నిరాశపరిచిన సినిమాలు ఓటీటీలో హిట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. దాని గురించి వదిలేస్తే.. ఈ సంవత్సరం థియేటర్లలో హిట్ అందుకుని ఓటీటీలో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమాలు ఏంటో చూద్దాం.

హనుమాన్:

ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాత్రం పెదవి విరిచారు. అయితే దానికి కౌంటర్ గా మరికొంతమంది ప్రేక్షకులు.. ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూడాలని, థియేటర్లో ఉండే సౌండ్ ఇంట్లో ఉండటం కష్టమని ఆన్సర్ చేశారు.

దేవర:

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. 500 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. అయితే ఓటీటీలో మాత్రం దీనికి తగినంత ఆదరణ లభించలేదు. సాధారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత.. దీని మీద ఎక్కువగా డిస్కషన్ జరగలేదు.

సరిపోదా శనివారం:

నేచురల్ స్టార్ నాని హీరోగా ఎస్ జె సూర్య విలన్ గా కనిపించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించుకుంది. కాకపోతే ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news