సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం, మంగళ, బుధ వారాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహా సభలను నిర్వహించనున్నారు. అయితే ఏబీవీసీ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహాసభలను ప్రారంభించి.. ప్రసంగించనున్నారు. గవర్నర్ తో పాటు ఈ సభలకు ఏబీవీపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశిష్ చౌహాన్ కూడా హాజరవుతారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటన పై ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు ఏబీవీపీ మహాసభల్లో మంగళవారం పూర్వ కార్యకర్తలతో సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తికి బుధవారం గౌరిజీ యువ పురస్కారం, రూ.50వేలు నగదు, మెమెంటోను అందించనున్నట్టు ఆమె తెలిపారు. మరోవైపు మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోనున్నట్టు వెల్లడించారు.