ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. కూటమి కార్యకర్తల సమావేశంలో నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే , నేను చెబితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు పార్థసారథి. వైసిపి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు రేషన్ షాపులు వదలేసి వెళ్ళాలి. లబ్ధి చేకూర్చే అన్నిటినీ విడిచి పెట్టాలి, లేక పోతే లెక్క వేరేగా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు పార్థసారథి.
వైసిపి వాళ్ళు పదేళ్లుగా చేసుకున్నది చాలు.. మా కార్యకర్తలకు అప్పగించండి. అధికారుల నుండి ఏలాంటి లేఖలు తెచ్చుకోం, నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. శాంతి యుతంగా ఉండాలి రౌడీయిజం, గుండాయిజం నాకు నచ్చదు అని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యల తరువాత 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు బీజేపీ కార్యకర్తలు. ఆ రేషన్ షాపులు మాకేనని లాగేసుకున్నారు బీజేపీ కార్యకర్తలు.