మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం మోడీదే: బండి సంజయ్

-

దేశంలో మాట ఇస్తే దానిని నెరవేర్చే ప్రభుత్వం ప్రధాని మోడీ దే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని బండి  వెల్లడించారు.

అలాగే మోడీ పాలనలో ఆర్థిక ప్రగతిలో నెం.5 చేరుకుందని, 2047 నాటికి భారత్ నెం.1 కావడం తథ్యం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.డిజటలైజేషన్ లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలను ప్రజలు చూశారు. కానీ బీజేపీ పాలనను చూడలేదు.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news