నీళ్ళు ఎక్కువగా తాగినా డేంజరే.. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఇవే

-

చాలామంది శరీరానికి కావలసినన్ని నీళ్లు తాగకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ కారణంగానే డీహైడ్రేషన్ కి గురై లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. అయితే మీకిది తెలుసా..? ఇంకొంతమంది ఎక్కువ నీళ్లు తాగి ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అతి మంచిది కాదు. మన శరీరానికి ఎన్ని నీళ్లు అవసరమో అన్ని మాత్రమే తాగాలి.

కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్లు తాగితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి.
కిడ్నీ సమస్యలు, కాలేయం సమస్యలు, అనవసర నొప్పులు, వికారంగా ఉండటం, వాంతులు అవ్వటం, తలనొప్పి తీవ్రంగా ఉండటం వంటి సమస్యలు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల వస్తాయి.

అంతేకాదు మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం, ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవ్వటం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం, కండరాలు పట్టేసుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇంకా శరీరం బాగా అలసిపోతుంటే కూడా మీరు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఎక్కువగా అథ్లెట్స్ లో కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్లు శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. ఆ కారణంగా చెమట రూపంలో నీరు బయటకు వెళ్ళిపోతుంది. దాంతో నీటిని ఎక్కువగా తీసుకుంటారు.

మూత్రం రంగు చెప్పే సంకేతాలు:

మీరు నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారని మూత్రం రంగు ద్వారా గుర్తించవచ్చు.
మూత్రం లేత పసుపు రంగులో కాకుండా పూర్తిగా తెలుపు రంగులో వచ్చినట్లయితే మీరు కావలసిన దానికంటే ఎక్కువగా నీళ్లు తాగుతున్నారని అర్థం.

మూత్రం రంగు ముదురు పసుపు రంగులో ఉంటే మీరు నీళ్లు తక్కువగా తాగుతున్నారని అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news