సంధ్య థియేటర్ లో డిసెంబర్ 04న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు శ్రీతేజను పరామర్శించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా శ్రీతేజ ను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.
శ్రీతేజ ఆరోగ్యం నిలకడగానే ఉంది. వెంటి లేటర్ తీసేసి రెండు రోజులు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. మళ్లీ రేపు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తో కలిశాను. ఇలాంటి ఘటన జరగడం దురష్టకరం అన్నారు. త్వరలో అల్లు అర్జున్ ని కూడా కలుస్తానని తెలిపారు దిల్ రాజు. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మద్యగా ఉంటూ ఎప్డీసీ చైర్మన్ గా నా బాధ్యతను నిర్వహిస్తాను. రేవతి భర్త భాస్కర్ కి సినీ ఇండస్ట్రీలో ఏదైనా ఉద్యోగం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు దిల్ రాజు.