రైతులకు విత్తనాల ఇబ్బంది కూడా లేకుండా ఉండడానికి వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటించింది. శాసన సభలో కూడా రైతు భరోసా పై చర్చ జరిగింది..జనవరి 30 న జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తున్న. జనవరిలో పంటలు వేసే సందర్భంలో రైతు భరోసా అందుతుందని ఆశిస్తున్న.
ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ఏ ఏ ప్రాజెక్టు ల ద్వారా ఎన్ని నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందనే పై సమాచారం తీసుకోవడం జరిగింది. నీటి లభ్యత ,తాగు నీటిని ఎంత అవసరం ,వ్యవసాయానికి ఎంత అవసరం అని ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. 90 రోజుల పాటు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా నీటి సరఫరా ఉంటుంది రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు త్వరగా వేసుకొని సరైన విధంగా వ్యవసాయం జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు జరిగింది.. కుటుంబ నిర్ధారణ అయినా వారికి కూడా రుణమాఫీ జరిగింది. మార్చి వరకు 2 లక్షల పైన ఉన్నవారికి పైన డబ్బులు చెల్లిస్తే పైన రుణమాఫీ జరుగుతుంది అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.