వికసిత్ భారత్ అనేది కల కాదు.. ఒక లక్ష్యం అన్నారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్. తాజాగా ఆయన మెదక్ జిల్లా లో ఇవాళ పర్యటించారు. మెదక్ జిల్లా తునికిలోని ICAR కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న 500 మంది రైతులను కలిసి ఆయన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే రెండేళ్లో భారత్ ప్రపంచంలో మూడో శక్తిగా మారబోతుందని తెలిపారు. భారత్ రోజు రోజుకు ఆర్థికంగా ఎదుగుతుందని తెలిపారు.
అంతకు ముందు ఆయన హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి మెదక్ కి గవర్నర్ తో కలిసి ఆయన వెళ్లారు.