తెలంగాణలో రేపు 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ..వివరాలు ఇవే !

-

 

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌. ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడిప్లస్ కంపెనీ ప్రయివేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న అంటే రేపు ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా ఉంటుందని ప్రకటన చేశారు.

job mela

ఈ కంపెనీలోని 100 ఫార్మసిస్ట్ & అసిస్టెంట్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, & డిగ్రీ, చేసిన 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది. మరిన్ని వివరాలకు HR Sailesh kumar ( Ph.No.9666662486 ) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద నేరుగా డిసెంబర్ 30 న హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news